పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

Valmiki Jayanti celebrations under the auspices of Police Departmentనవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాద్ కమీషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (అడ్మిన్)) కోటేశ్వర రావు, అదనపు డి.సి.పి ( లా అండ్ ఆర్డర్ )  బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మహార్షి వాల్మీకి జయంతి కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి ఫోటోకు పుష్పగుచ్చాలు సమర్పించారు. అనంతరం అదనపు పోలీస్ కమీషనర్లు మాట్లాడుతూ.. శ్రీ మద్రామాయణ మహాకావ్య సృష్టికర్త మహార్షి వాల్మీకి అనియు, ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాడిగా అడవిలో పెరిగి, సప్తఋషుల బోధనల ద్వారా మహార్షి వాల్మీకిగా మారి అద్భుతమైన రామాయణం గ్రంధాన్ని మనకు అందించిన మహానీయుడు వాల్మీకి అనియు, మనము అందరమూ ఆయనను స్మరించుకోవలసిన అవసరం ఉందని, ఆదర్శవంతమైన జీవితం గడపడంతో పాటు సమాజ శ్రేయస్సుకు అవసరమైన జీవన సూత్రాలను రామాయణం ద్వారా వాల్మీకి బోధించారని తెలియజేశారు. ఈ జయంతి సందర్భంగా ఆఫీస్ సూపరింటెండెంటులు  శంకర్, రిజర్వుఇన్స్ పెక్టర్స్ పోలీస్ కార్యాలయం సిబ్బంది, సి.సి. ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది పాల్గొన్నారు.