నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
అది కవి మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా నేటి తరం వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే అన్నారు. గురువారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టరు బెన్ షాలోమ్ మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణం చదివినప్పుడల్లా అందరికి ఆదికవి వాల్మీకి గుర్తుకు వస్తారన్నారు.ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఆదర్శకావ్యం రామాయణమని అలాంటి రామాయణాన్ని రచించిన వాల్మీకి జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా స్ఫూర్తిని పొంది, వారి మార్గంలో పయనించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామన్నారు.

రామాయణంలో మానవ విలువలు గురించి, మనిషి ఎలా ఉండాలో తెలియచేసిన వాల్మీకి అందరికి స్ఫూర్తి దాయాకమని, వారి స్ఫూర్తి తో నేటితరం ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రతీ రోజు మనం చేసే పనుల్లో మంచి, చెడును గ్రహించి మానవత దృక్పధం కలిగి ఉండాలని,అలాగే చేసే ప్రతీ పనిని అంకితభావంతో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి యాదయ్య, కలెక్టరెట్ ఏఓ జగన్ మోహన్ ప్రసాద్, వాల్మీకి బోయ కమ్యూనిటీ జిల్లా ప్రెసిడెంట్ రాజయ్య,కమ్యూనిటీ సభ్యులు, వివిధ శాఖలకి చెందిన అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.