
నవతెలంగాణ – మల్హర్ రావు
యువతరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి లోక్ సభ ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు బుధవారం గడ్డం వంశీకి మద్దతుగా.. పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులతో ప్రెస్ మీట్ నిర్వహించి దుద్దిళ్ల మాట్లాడారు కాకా వెంకటస్వామి మనవడిగా గడ్డం వంశీకి గుర్తింపు ఉందని.. తన ట్రస్ట్ ద్వారా వంశీ అనేక సేవా కార్యక్రమాలుచేస్తున్నారని చెప్పారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో గడ్డం వంశీకృష్ణ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు. వంశీకృష్ణను గెలిపించడానికి తామంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. వంశీకృష్ణను ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.