మండలంలో ప్రారంభమైన వన మహోత్సవం..

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని అయా గ్రామాల్లో వన మహోత్సవం ప్రారంభమైంది. శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీడీఓ లక్ష్మప్ప,పెరుకబండ గ్రామంలో ఎంపీఓ విష్ణు వర్ధన్, ఏపీఎం నర్సయ్య పంచాయితీ కార్యదర్శులు, మహిళల సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో మొక్కలు నాటారు. అయా గ్రామాల పంచాయితీ కార్యదర్శులు ,ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.