
చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో ఎన్ పి ఆర్ డి గ్రామ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, వికలాంగుల చట్టాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వo విఫలం చెందిందని, నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ సాధన కోసం ఉద్యమం చేస్తామని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ హెచ్చరించారు.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 8 ఏండ్లు అవుతున్న నేటికీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లగ్ పోస్తులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై జరుగుతున్న వేధింపులు అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్స్ సాధన కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వికలాంగులకు నిరుద్యోగ భృతి ఆరువేల రూపాయలు ఇవ్వాలని ప్రతి వికలాంగునికి అన్ని రకాల పరికరాలు ఇవ్వాలని ఇండ్లు ఇళ్ల స్థలాలు కట్టివాలని మహిళ వికలాంగులకు కుటీర పరిశ్రమలు ఇంటి దగ్గరనే ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని వికలాంగులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకు ద్వారా ఎలాంటి చరితులు లేకుండా 100% సబ్సిడీ తోటి 10 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం పెద్ద కొండూరు గ్రామ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఎన్ పి ఆర్ డి గౌరవ అధ్యక్షులు ముప్పిడి యాదయ్య అధ్యక్షులు సంజీవ శంకర్ ఉపాధ్యక్షులు దేవరకొండ నిర్మలమ్మ ప్రధాన కార్యదర్శి మోర మహేష్ సాయి కార్యదర్శి పడమటి పాపిరెడ్డి కోశాధికారి పోలబోయిన శేఖర్ ఈ కార్యక్రమంలో సంజీవ నరసింహ దుబ్బెరుక నాగరాజు గుండబోయిన అశోకు గౌరెల్లి బీరయ్య జక్కిడి మల్లారెడ్డి యశోద తదితరులు పాల్గొన్నారు.