
రెంజల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవరణ ఉపాధి హామీ కు మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హెచ్ .శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ ఈ.సాయన్న, ఏపీఓ రమణ, గ్రామ కార్యదర్శి రాజేందర్రావు, సాంకేతిక సహాయకులు రాజేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, క్షేత్ర సహాయకులు శోభన్, కానిస్టేబుల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.