నవతెలంగాణ – రాయపర్తి
పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి వన మహోత్సవం కార్యక్రమాలను విధిగా నిర్వహించాలని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తూరు పాఠశాలలో నిర్వహించిన వనమోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మొక్కలు నాటారు. తదుపరి పాఠశాల పరిసరాలను, చెట్లను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులకు సూచనలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తే విద్యార్థులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. మొక్కలే మానవ మొనగాడకు జీవనాధారం అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి హరిత తెలంగాణకు సహకరించాలని కోరారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నోముల రంగయ్య, కాంప్లెక్స్ సిఆర్పి శీనపల్లి రాజు, గ్రామస్తులు కందికట్ల విజయ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.