ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వనమహోత్సవం

Vanamahotsavam at Govt Junior Collegeనవతెలంగాణ – తాడ్వాయి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ రాంపాక అవిలయ్య ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ద్వారా ప్రపంచ ప్రకృతి దినోత్సవ సందర్భంగా వనమహోత్సవం కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాంపాక అవిలయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి, విద్యార్థి దశ నుండి మొక్కలను నాటి, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. జీవులన్నీ సహజ వనరులైన ఆహారం, ప్రాణవాయువు మొదలగు వాటిపైన ఆధారపడి ఉన్నాయన్నారు. మానవుని కార్యకలాపాల వల్ల హుజూన్ కొరకు నష్టం వాటిల్లందని మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాన్నాం అని అన్నారు. ప్రతి ఒక్కరూ వీలైన ప్రతి చోట మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొమ్మాల సంధ్య, లైబ్రేరియన్ రాములు నాయక్, లెక్చరర్లు కిషన్, శ్వేత, బిక్షం, రాజ్ కుమార్, రాజు, శ్రీలత, అశోక్, నాగరాజు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.