బడా కార్పొరేట్ల కోసమే ‘వందేభారత్‌’!

బడా కార్పొరేట్ల కోసమే 'వందేభారత్‌'!ప్రధాని నరేంద్రమోడీ బడా కార్పొరేట్లకు హామీలివ్వడానికి జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కారు. వందే భారత్‌ రైళ్ల ప్రవేశం ఈ విధానాలకు అనుగుణంగానే ఉంది. దేశాభివఅద్ధికి వందేభారత్‌ రైళ్లను నడుపుతున్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవాలను దాచిపెట్టి, ఎన్నికల లాభాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడమే. మార్చి 2024 నాటికి, 41 వందే భారత్‌ రైళ్లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో పదహారు రైళ్లు 16- బోగీల సర్వీసులు, ఇరవై ఐదు 8- బోగీల సర్వీసులు. అత్యంత ప్రచారంలో ఉన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రభుత్వ ఉద్దేశాలను బట్టబయలు చేస్తోంది. ఇది ప్రభుత్వ పెట్టుబడులను పణంగా పెట్టి రైల్వే ఆస్తులను కార్పొరేట్‌లకు అప్ప గించే లోతైన కుట్ర తప్ప మరొకటి కాదు. శతాబ్ది దూరం, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో లభించే అదే ప్రయోజనాలతో వందేభారత్‌ రైళ్ల అధిక టిక్కెట్‌ ధరలు ప్రజాధనాన్ని దోచుకోవడమే. రైలువేగాన్ని సాధించడం కోచ్‌ల నిర్మాణం ద్వారా కాదు, కానీ ఈ రైళ్లకు లైన్‌క్లియర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జరుగుతుంది. దేశం నిజమైన అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నడిచే ప్యాసింజర్‌ రైళ్లను వందే భారత్‌ రైళ్ల వేగాన్ని పొందడానికి రద్దు చేయడం వాస్తవం.
ఆత్మనిర్భర్‌ గురించి మోడీ వాగ్ధానంలోని వాస్తవమెంత?
స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్ధారించడంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వైఫల్యం అనేక విధాలుగా బహిర్గతం చేయబడింది. మోడీ ఆత్మ-నిర్భర్‌ భారత్‌ కాంట్రాక్ట్‌ సిబ్బందిని నిరంతర దోపిడీకి గురిచేస్తోంది. ఇది కార్పొరేట్ల ప్రయోజనాలకనుగుణంగా స్వదేశీ తయారీ యూనిట్లను నిర్వీర్యం చేయడాన్ని మరింత బహిర్గ తం చేస్తోంది. భారతీయ రైల్వే కోచ్‌ల సేకరణ ప్రక్రియలో ఇటీవలి పరిణామాలు ప్రభుత్వం, కార్పొరేట్‌ల మధ్య అనుబంధాన్ని రుజువు చేస్తున్నాయి. ఏప్రిల్‌ 2022లో, భారతీయ రైల్వేలు రూ.26వేల కోట్ల అంచనా వ్యయంతో 200 వందే భారత్‌ ట్రైన్‌సెట్‌ల రూపకల్పన, తయారీకి టెండర్లు జారీ చేసింది. ఈ అంచనాలో ఉత్పత్తి ఖర్చులు మా త్రమే కాకుండా, రైళ్ల తయారీకి ప్రతిపాదించబడిన లాతూర్‌ లోని మరఠ్వాడా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ, ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ పెరంబూర్‌లో మౌలిక సదు పాయాల నవీకరణలు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు 35 ఏండ్ల వ్యవధిలో వాటి నిర్వహణ కోసం అదనంగా రూ.32వేలు కోట్లు అందజేశారు.
రష్యన్‌ కంపెనీ టీఎంహెచ్‌, భారతదేశానికి చెందిన రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌లతో కూడిన కన్సార్టియం స్లీపర్‌ వేరియంట్‌లతో సహా 120 వందే భారత్‌ రైళ్ల ఉత్పత్తికి ఆర్డర్‌ను పొందింది. ఇది చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, కపుర్తలాలోని రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ, రారు బరేలీలోని మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ వంటి దేశీయ తయారీ యూనిట్లను మూసివేసే ప్రమాదం ఉంది. నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన చెన్నరులోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ గతంలో మొదటి వందే భారత్‌ రైళ్లను ఉత్పత్తి చేసింది. ఈ ఫ్యాక్టరీలన్నింటిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు ప్రపంచ స్థాయి కోచ్‌లను తయారు చేయగలవు. 19వేల మంది శాశ్వత సిబ్బంది బలం, అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన, స్వదేశీ రోలింగ్‌ స్టాక్‌ను స్థిరంగా అందించింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలోనే, ఈ యూనిట్లు సమిష్టిగా 7,903 కోచ్‌లను తయారు చేశాయి, వాటి సాంకేతిక నైపుణ్యం, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ కాంట్రాక్టు ప్రకారం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 45 మరమ్మతు వర్క్‌షాప్‌లు, 212 మెయింటెనెన్స్‌ డిపోలలో ప్రస్తుతం పనిచేస్తున్న 5.5 లక్షల మెకానికల్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ శాశ్వత సిబ్బంది జీవనోపాధి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. రానున్న కాలంలో ఈ పోస్ట్‌లను కాంట్రాక్ట్‌ పద్ధతిలో నింపుతారు. నిస్సందేహంగా ఈ ఆత్మనిర్భర్‌ భారతదేశాన్ని నాశనం చేస్తుంది.నిరుద్యోగ యువతకు సురక్షిత మైన ఉపాధి అవకాశాలను అందించాలనే జాతీయ ఆవశ్యకతను దెబ్బతీస్తుంది..
సబ్‌కా సాత్‌..సబ్‌కా వికాస్‌ హామీ ఎక్కడీ
‘సబ్‌కా సాత్‌..సబ్‌కా వికాస్‌’ అనే నినాదంతో మోడీ మొత్తం 41 రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. మోడీ కంటి ఎదురుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస జీతాలు, 8 గంటల పని, ఓటి చెల్లింపు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సౌకర్యాలు దొరకటం లేదు. మరెందుకు జోక్యం చేసుకోవటం లేదు. వందే భారత్‌ రైళ్లలో ప్రాథమిక సేవలందించడానికి బాధ్యత వహించే వ్యక్తుల దోపిడీకి దారితీసే కాంట్రాక్ట్‌ మీద ఎందుకు మౌనం వహిస్తున్నాడు? కాంట్రాక్టు నిర్మాణాల అమానవీయ పనులను రద్దు చేస్తామని, కాంట్రాక్టు కార్మికులకు ఆయన ఎందుకు హామీ ఇవ్వరు? వారు రోజుకు 20 గంటలకు పైగా పనిచేస్తారు. వందే భారత్‌ చుట్టూ జరుగుతున్న అత్యున్నత ప్రచారం అనేక వాస్తవా లను దాచిపెడుతోంది. కాంట్రాక్ట్‌ ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్‌ కార్మికులు కనీస వేతనాలు, బోనస్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇతర సామాజిక ప్రయోజ నాల వంటి ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం పొందా లి. అయితే, కాంట్రాక్టర్లు కుదుర్చుకున్న ఒప్పందాన్ని పాటించకపోవడం, వాటిని పరిష్కరిం చడంలో రైల్వేలేబర్‌ అధికారులు ఎటువంటి బాధ్యత లేకుండా మౌనం వహించడం జరుగుతున్న వాస్తవం.
ఒక సాధారణ లెక్క ప్రకారం, ఈ కాంట్రాక్‌ కార్మికులు వారి సేవలను కొనసాగించడానికి తమ చట్టబద్ధమైన సంపాదన నుంచి కాంట్రాక్టర్‌కు, ఒక్కొక్కరు ప్రతి నెలా రూ.పదివేలు లంచంగా తిరిగి చెల్లిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన 41 వందే భారత్‌ రైళ్లలో పనిచేస్తున్న 800 మంది కాంట్రాక్ట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను పరిశీలిస్తే, బడా కాంట్రాక్టర్లు దోచుకున్న ప్రజాధనం మొత్తం ఏడాదికి 9.60 కోట్లు. ఈ లెక్కన కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ విధినిర్వహణ చూస్తే వాస్తవంగా రోజుకు 20 గంటలు, అంటే వందే భారత్‌ రైలు బయలుదేరి స్టేషన్‌ నుండి మరల అదే స్టేషన్‌కు తిరిగి వచ్చేదాకా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ”సబ్‌కా సాత్‌..సబ్‌కా వికాస’్‌ కథనాలు కాం ట్రాక్ట్‌ సిబ్బందిని కార్పొరేట్‌ సంస్థ వికాస్‌ కోసం దోపిడీ చేయడమేనని. దీని కోసం మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కాంట్రాక్ట్‌ సిబ్బందితో శాశ్వత సిబ్బందిని తొలగించే విధానా లను రూపొందిస్తోంది. మొత్తం రైల్వే వ్యవస్థలో దాదాపు ఐదు లక్షల మంది కాంట్రాక్టు కార్మికులు సేవలందించే బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఎలాంటి తనిఖీలు లేకుండానే కార్పొరేట్‌ సంస్థలకు బదిలీ చేయబడిం దని ఇది రుజువు చేస్తోంది. ఇలాంటి అభివృద్ధి దేశ శ్రేయస్సు కోసం కాదని మనం ఇప్పుడు గ్రహించాలి. ప్రజాధనంతో నిర్మించిన లాభదాయకమైన జాతీయ ఆస్తులను అప్పగించడం ద్వారా కార్పొరేట్లకు భారీ లాభాలను ఆర్జించాలని ఇది ఉద్దేశించబడింది.
ఈ వ్యూహం దేశ సంక్షేమానికి హాని కలిగించడమే కాకుండా అభివృద్ధి ముసుగులో చేసే ఈ ముతక ప్రచారం దేశ సంక్షేమం కోసం కాదని, కేవలం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమేనని కూడా ప్రజలు గ్రహించాలి. సురక్షిత ఉద్యోగాల కల్పన, ఉత్పాదక యూనిట్లను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేయడం, ఛార్జీలు, సీనియర్‌ సిటిజన్లు, విద్యార్థులు, ఇతర బలహీన వర్గాలకు రాయితీలు కల్పించడం ద్వారా రైల్వేలను బలోపేతం చేయడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. రైల్వేలను పరిరక్షించడం, యువతరానికి సురక్షితమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, జాతీయ స్వావలంబనను పెంపొందిం చడం, వంటి వాటికి ప్రాధాన్యతనివ్వని సర్కార్‌ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది.
డి.రమేష్‌బాబు
9822684142