సకుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్న వంగపల్లి శ్రీనివాస్ మాదిగ

నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను శనివారం సకుటుంబ సమేతంగా ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగలు దర్శించుకున్నారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎండోమెంట్ అధికారులు పూజారులు ప్రసాదం అందించి సన్మానించారు. సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ  మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. ప్రభుత్వాలు వన దేవతల జాతరను ఇంకా అభివృద్ధి చేయాలని అన్నారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి పుల్ల సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.