మద్నూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా రెండవసారి వంగపల్లి వార్ యోగేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన అందున ఆర్యవైశ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నందున ఆయనకే మళ్లీ కులస్తులంతా రెండోసారి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కులస్తులు తెలిపారు. ఈ సందర్భంగా యోగేష్ మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు తమపై నమ్మకంతో రెండోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కుల పెద్దలకు కులస్తులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.