తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకు ఎంపికైన వాణి హైస్కూల్ విద్యార్థి…

నవతెలంగాణ – డిచ్ పల్లి
మండల కేంద్రం లోని వాణీ హైస్కూల్లో 1వ తరగతి చదువుచున్న గుట్ట వంశీక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కు “పేరిణి నృత్య ప్రదర్శనకు గాను ఎంపికైందని వాణి హైస్కూల్ కరస్పాండెంట్ మోహమ్మద్ నబీ బుధవారం తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా 216 మంది విద్యార్థులు ఒకే వేదిక పై పేరిణి నృత్య ప్రదర్శన చేయగా తెలుగు బుక్ఫ్ రికార్డ్స్ జ్యూజి మెంబక్స్ అలకించి ఈ సందర్భంగా “వంశిక పేరును నమోదు చేయడం చేసినట్లు మోహమ్మద్ నబీ వివరించారు‌.ఈ సందర్భంగా వాణి హైస్కూల్ కరస్పాండెంట్ మోహమ్మద్ నబీ, ప్రధానోపాధ్యాయులు బి. మోహన్ రాజ్ లు మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన వంశిక పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించి జ్యురి సబ్యుల మన్ననలు పోందాడం శుభపరిణామ మన్నారు. అతి చిన్న వయసులోనే ఈ ఘనతను సాధించడం పాఠశాలకే గర్వకారణమన్నారు. రాబోవు రోజుల్లో వాణి నృత్యంలో రాటుదేలడం ఖాయమన్నారు. అనంతరం పాఠశాలలో సిబ్బంది వటిక కు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.