వర్ధమాన్ పత్తి కొనుగోలు కేంద్రం పారంభం..

Vardhaman cotton buying center started..– పత్తి మిల్లు యజమాని కుటుంబీకులంతా ప్రత్యేక పూజలు..
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మద్నూర్ మండలంలోని హండే కెలూరు గ్రామపంచాయతీ పరిధిలోకి వచ్చే వర్దానంద్ కాటన్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో ఆదివారం కుటుంబ సభ్యులంతా ప్రత్యేక పూజలు నిర్వహించి కొనుగోలు ప్రారంభించారు. కొనుగోళ్లు ప్రారంభోత్సవంలో పత్తి మిల్లుల వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు హాజరయ్యారు. కొనుగోలు ప్రారంభించిన పత్తి మిల్లు యజమాని జ్ఞాను సెట్ పత్తి ధర క్వింటాలుకు రూ.7,101/-  ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ పరిధిలోని ప్రైవేట్ పత్తి మిల్లుల వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, పత్తి రైతులు పాల్గొన్నారు.