వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

నవతెలంగాణ – సిద్దిపేట
గంప ప్రేమ్ సాయి పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో నిరుపేద మహిళ వెంపటి విజయలక్ష్మికి కుట్టు మిషన్ బహుకరించడం జరిగిందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గంప కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ  మంకాళ సుప్రియ- సంతోష్ ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా పట్టణ నిరాశ్రయుల ఆశ్రమంలో అన్నదానం,  అల్లాడి వెంకటేశం  కోడలు అపర్ణ  సీమంతం సందర్భంగా వైశ్య భవనం గోశాలలో గో సేవ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ పుల్లూరి శివకుమార్, వాసవి క్లబ్ అధ్యక్షుడు చింత రాజేంద్రప్రసాద్ , వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తొడుపునూరి కృష్ణవేణి, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు అరవపల్లి హరికిరణ్ , కార్యదర్శి చకిలం రవి, కోశాధికారి బూరుగు వేణుగోపాల్, తిమ్మిశెట్టి విజయలక్ష్మి,  గ్రీటింగ్ చైర్మన్  మర్యాల వీరేశం, వైశ్య భవన్ కోశాధికారి కూర శ్రీనివాస్, కటుకం మోనయ్య, కాస్నగొట్టు నాగరాజు, ఇల్లెందుల నాగేందర్ ,గంప వెంకటలక్ష్మి, నీరజ తదితరులు పాల్గొన్నారు.