
నల్గొండ జిల్లా మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వర్కాల మోహన్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. అధికారుల బదిలీల్లో భాగంగా పిఏ మండలం ఎంపిఓ, ఇంచార్జి ఎంపీడీఓగా పనిచేస్తూ బదిలీ పై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎంపీడి ఓ లక్ష్మి సూర్యాపేట జిల్లాకు బదిలీ పై వెళ్ళారు. అదేవిదంగా ఇక్కడ పనిచేసిన ఎంపీఓ కూన్ రెడ్డి విజయకుమారి బదిలీలలో భాగంగా అనుముల మండలం హాలియాకు వెళ్లారు. పెద్దవూర కు బదిలీ పై వచ్చిన నూతన ఎంపీడిఓ ను కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.