
నవతెలంగాణ – చండూరు
బీజేపీ పార్టీ నల్లగొండ జిల్లా చేనేత సెల్ జిల్లా కన్వీనర్ గా గట్టుప్పల గ్రామనికి చెందిన వర్కాల శ్రీనివాస్ ని, కో- కన్వీనర్ గా చర్లపల్లి గ్రామానికి చెందిన కటకం శ్రీధర్ ని నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వార్షిత్ రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలపై పోరాడి ..చెనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో ముందు ఉండి, బీజేపీ పార్టీ ని బలోపేతం కృషి చేస్తానని తెలిపారు. నియామక పత్రాన్ని అందజేసిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ,మాదగాని శ్రీనివాస్ గౌడ్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి,చేనేత సెల్ రాష్ట్ర కో-కన్వీనర్ మిర్యాల వెంకటేశం ,నల్లగొండ పార్లమెంట్ జిల్లా కో-కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఉన్నారు.