నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : నవంబర్ తేదీ 3,4,5 తేదీలలో కామారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14 ఖో-ఖో పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనాజీపురం లో తొమ్మిదవ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థిని యం.వర్షిత మంచి నైపుణ్యాన్ని కనబరిచి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగవర్ధన్ రెడ్డి తెలిపారు. జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన ఎం.వర్షితను , విద్యార్థిని ఎంపికలో ఫిజికల్ డైరెక్టర్ కృషి ఎంతగానో ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్వాయి నాగ వర్ధన్ రెడ్డి , ఏ ఏ పీ. సి ఛైర్పర్సన్ రాయపురం ప్రీతి ,మాజీ సర్పంచ్ ఏదునూరి ప్రేమలత మల్లేశం , మాజీ ఎంపీటీసీ గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు, అభినందించారు.