
మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను యూత్ అసోసియేషన్ కమిషనర్ వాసం వెంకటేశ్వర్లు బుధవారం దర్శించుకున్నారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎండోమెంట్ అధికారులు పూజారులు ప్రసాదం అందించి సన్మానించారు. యూత్ సర్వీసెస్ కమీషన్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు.