వాసవి క్లబ్ సేవలు అభినందనీయం

– వాసవియాన్ కపుల్ సిల్వర్ స్టార్ కెసిజియప్ విశ్వనాథం నగేష్ 
నవ తెలంగాణ – సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలోని వాసవి క్లబ్ లు అందిస్తున్న సేవలు అభినందనీయమని వాసవియాన్ కపుల్ సిల్వర్ స్టార్ కెసిజియప్ విశ్వనాథం నగేష్ అన్నారు.  స్థానిక దేవి గార్డెన్ లో ఆదివారం పుల్లూరి వారి ప్రాంతీయ సదస్సు భవ్య మని రికాన్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో పాటు, పుస్తెమట్టెలు, కుట్టు మిషన్లు, బియ్యం పంపిణీ, నిరుపేదలకు ఆర్థికసహాయం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.  సూపర్ ఫస్ట్ బెస్ట్ క్లబ్ అవార్డ్ వాసవి క్లబ్ సిద్దిపేట, ఫస్ట్ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు వాసవి వనితా సిద్దిపేట,  బెస్ట్ మ్యాన్ ఆఫ్ మైలేజ్ అవార్డు గ్రేటర్ హుస్నాబాద్ క్లబ్బులకు రీజియన్ చైర్పర్సన్ పుల్లూరి శివకుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ క్లబ్ గంప శ్రీనివాస్, కోర్తివాడ రాజేందర్, పుల్లూరి ప్రకాష్, గంప కృష్ణమూర్తి, యాద శ్రీనివాస్, ఇరుకుల ప్రదీప్ కుమార్, జిల్లా నాయకులు మాంకాల నవీన్ కుమార్, నేతి వేణుకుమార్, మంకాల శ్రీనివాస్, పుల్లూరి శ్రీనివాస్, పుల్లూరి శశాంక్, సోమ వనజ, సోమ శివకుమార్, బూరుగు వేణుగోపాల్, శివ్వ విశ్వప్రసాద్,  కొమరవెల్లి అంజయ్య,  ఏడు క్లబ్ ల పిఎస్టీలు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.