సుమన్ తేజ్, అను శ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వశిష్ఠ’. ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత లయన్ సాయివెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహారి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యాడ్ ఫిలింమేకర్ యమున కిషోర్ ఫస్ట్ షాట్‌కి డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత నోరి నాగప్రసాద్ మాట్లాడుతూ,’ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది. స్క్రిప్ట్ వినగానే మా హీరో సుమన్ తేజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఒక సక్సెస్‌ఫుల్ మూవీతో మీ ముందుకు వస్తాం’ అని తెలిపారు. ‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సోషల్ డ్రామా ఇది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది’ అని డైరెక్టర్ హరీశ్ చావా చెప్పారు. హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ,”రంగస్థలం’లాంటి మూవీలో నటించాలనే కోరిక ఉండేది. ఈ కథ విన్నప్పుడు నేను కోరుకున్న స్క్రిప్ట్ ఇదే అనే ఫీల్ కలిగింది. డైరెక్టర్ హరీశ్ ప్రతిభ ఈ సినిమాతో అందరికీ తెలుస్తుంది’ అని తెలిపారు.