సంస్కృతంలో ‘వస్సాహి ..’ పాట

'Vassahi ..' song in Sanskritరవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్‌ హీరోగా నటిస్తోన్న సినిమా ‘మిస్టర్‌ ఇడియట్‌’. సిమ్రాన్‌ శర్మ హీరోయిన్‌. జేజేఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జేజేఆర్‌ రవిచంద్‌ నిర్మిస్తున్నారు. దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్‌ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా నటుడు శివాజీ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ‘వస్సాహి వస్సాహి..’ లిరికల్‌ సాంగ్‌ రిలీజైంది. బ్యూటిఫుల్‌ కంపోజిషన్‌తో, కలర్‌ ఫుల్‌ పిక్చరైజేషన్‌తో ఈ పాట ఆకట్టుకుందని, ఇంతవరకు సంస్కత భాషలో ఏ పాట రాలేదు, ఇది ఫస్ట్‌ సాంగ్‌ అని శివాజీ ప్రశంసించారు. ఈ పాటను అనూప్‌ రూబెన్స్‌ మంచి బీట్‌తో కంపోజ్‌ చేయగా, శివశక్తి దత్తా సాహిత్యాన్ని అందించారు. సింగర్‌ శ్రీరామచంద్ర ఎనర్జిటిక్‌గా పాడారు. ‘సౌందర్య సార, మకరంద దార, శృంగార పారవరా, సౌవర్ణ ప్రతిమ, లావణ్య గరిమ… ఇదంకిం తమాషా…వస్సాహి వస్సాహి’ అంటూ సంస్కత సాహిత్యంతో ఆకట్టుకునేలా సాగుతుందీ పాట అని మేకర్స్‌ చెప్పారు.