నవతెలంగాణ-పెన్ పహాడ్ : మండల పరిధిలోని దూపాడు గ్రామంలోని ఎల్జెఆర్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం 27వ వార్షికోత్సవ పండగలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ గంటేపంగు ఇమానియేల్ ప్రార్థనలో భాగంగా వట్టే జానయ్య యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి పట్టణ అధ్యక్షులు గండూరి కృపాకర్, కౌన్సిలర్ ధరావత్ లింగానాయక్, నాయకులు రణపంగ శ్రవణ్, గుగ్గిళ్ల శాంసన్, వగ్గు వెంకన్న, కుంభం నాగరాజు, చర్చి సభ్యులు నన్నెపంగ సైదులు, ఇశ్రాయేలు, కార్యదర్శి రవి, శ్యాంసన్, సేవ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.