తహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విడిసి సభ్యులు

నవతెలంగాణ -కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ రమేష్ ను గురువారం  మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్ సక్కరం అశోక్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఆయనను కలిసి బాధ్యతలు  చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్, ఆర్ఐ  శరత్ కుమార్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఆకుల బాజన్న, కార్యదర్శి గంగారాం, సదరు అల్లకొండ గంగాధర్, గ్రామ అభివృద్ధి కమిటీ సంఘ సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.