వీడీసీ అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శ

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ వీడీసీ అధ్యక్షులు బోయిని శ్రీనివాస్ తల్లి బాలమని బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంటా మాజీ సర్పంచ్ శ్రీనివాస్, బస్వాపూర్ సొసైటీ వైస్ చైర్మన్ స్వామి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, గ్రామ పెద్దలు, తదితరులు ఉన్నారు.