గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా వేద రజినిసాయిచంద్‌

– ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా వేద రజిని సాయిచంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. పదవీ కాలం రెండేండ్లపాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల గుండెపోటుతో ఉద్యమకారుడు, గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ వేద సాయిచంద్‌ మరణించాడు. ఆయన భార్యకు చైర్మెన్‌ పదవీ ఇవ్వడంతోపాటు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే చైర్మెన్‌గా నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని రాష్ట్ర ప్రభుత్వం తరుపున విప్‌, ఎమ్మెల్యే బాల్కసుమన్‌, సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షులు కంగర్ల మల్లయ్య, బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ తదితరులు కలిసి రజినికి అందజేశారు.