– రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించిన ఐశ్వర్య రెడ్డి
– విద్యార్థిని సన్మానించిన పాఠశాల చైర్మెన్ చుక్క అల్లాజీగౌడ్
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ పట్టణంలోని లిటిల్ స్కాలర్స్ టెక్నో స్కూల్ విద్యార్థి మ్యాక ఐశ్వర్య రెడ్డి వేదిక్ మ్యాథ్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించింది. హైదరాబాద్ కూకట్‌పల్లి టీఎన్‌ఎమ్ స్కూల్‌లో నిర్వహించిన వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి మ్యాక ఐశ్వర్యరెడ్డి పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రెండోవ స్థానంలో నిలిచిందని పాఠశాల చైర్మెన్ చుక్క అల్లాజీ తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో యాజమాన్య కమిటీ సభ్యులతో పాటు ఉపాధ్యాయ బృందంతో కలిసి ఐశ్వర్యరెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినం దించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 170 పాఠశాలల నుంచి 400 మంది విద్యార్థులు పాల్గొన్న ఈపోటీల్లో ఐశ్వర్యరెడ్డి అత్యంత ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన ఐశ్వర్య రెడ్డి పుట్టి పెరిగిన ప్రాంతంతో పాటు చదువుతున్న పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని అభినందించారు. అదేవిధంగా పాఠ శాలలో రెండోవ తరగతి చదువుతున్న లక్ష్మీప్రేమ అబాకస్ పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచినట్టు ఆయన చెప్పుకొచ్చారు. గత నాలుగేండ్లుగా పాఠశాల విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయి వేదిక్ మ్యాథ్స్, అబాకస్ పోటీలలో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారని అల్లాజీ గౌడ్ తెలిపారు.ఈ కార్య క్రమంలో భాగంగా అబాకస్ విన్నర్ లక్ష్మీప్రేమను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జిల్లెల్ల సుజాతారెడ్డి, డైరెక్టర్ చుక్క సావిత్రి, అకాడమిక్ అడ్వయిజర్ జిల్లెల్ల సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం శ్వేత, హైమావతి, స్వాతి, శ్రీజన్య, రాధిక, గీత, మమత, చలం, యాదయ్య, శ్రీశైలం, వెంకటేశ్వర్లు, తేజ నందిని, లక్ష్మి, మధు శ్రీ, నాగమణి, రాధిక, శర్మ, శివలింగం, వరలక్ష్మి, ఝాన్సీ, అలేఖ్య పాల్గొన్నారు.