వీణవంక మినీ మేడారం జాతరను విజయవంతం చేయాలి

నవతెలంగాణ – వీణవంక
వీణవంకలో జరిగే మినీ మేడారం సమ్మక్కసారలమ్మ జాతరను విజయవంతం చేయాలని జాతర ధర్మకర్త పాడి ఉదయ్ నందన్ రెడ్డి కోరారు. మండల కేంద్రంలో త్వరలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతర పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల గురికాకుండా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, ప్రజలు అమృత ప్రభాకర్, ఎండీ సాహెబ్ హుస్సెన్, మాదాసు సునీల్, నీల ఎల్లయ్య, భిక్షపతి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.