
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొత్త నరసింహులు పాల్గొని మాట్లాడుతూ నిజాం ప్రభువులు దొరల గడీల ముందు కాలుమొక్తుతా బాంచన్ అని చెప్పి నిజాం ప్రభువుల ముందు బానిసలుగా పనిచేస్తూ సర్వసాన్ని అప్పగించి భూములను సైతం కోల్పోయినటువంటి ప్రజలను చైతన్యం చేసి బాంచన్ దురా అని చెప్పి కాళ్ళు మొక్కిన ప్రజల చేత బందుకులను పట్టించిన ఘన చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు. నిజాం ప్రభువులు ఈ ప్రాంత ప్రజల రైతుల భూములు గుంజుకొని శిస్తు ,పన్నుల పేరుతో తల వెంట్రుకలకు ప్రజలు వేసుకునే దుస్తులకు పన్నులు వేసి అవి నిజాం కు కట్టలేక భూములను అప్పగించారన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ దళాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున పోరాటం జరిగినప్పుడు నిజాం లొంగిపోయాడని ఆ ఉద్యమం విజయం అనంతరం లక్ష ఎకరాల భూ పంపిణీ కమ్యూనిస్టులు చేశారన్నారు. ఆ పోరాటంలో వేలమంది కమ్యూనిస్టులు అసలు భాషారని అన్నారు. షేక్ బందంగి అనే ముస్లిం యువకుడు మొట్టమొదటిసారి ప్రాణాలు కోల్పోయాడని మొన్నటి వరకు ఉన్నటువంటి మల్లు స్వరాజ్యం, చిట్యాల ఐలమ్మ లాంటి ఎందరో నాయకులు ఈ పోరాటంలో పాల్గొని భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని అమరవీరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి పేరం నర్సవ్వ, నర్సింలు, కొంగ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.