
మద్నూర్ మండల కేంద్రంలోని జంగం గల్లి లో గల వీరభద్ర స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా కొనసాగిన ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అగ్నిగుండంలో భక్తులు నడిచి కోరికలు తీర్చాలని మొక్కుకున్నారు. ఈ ఉత్సవాల్లో మద్నూరు గ్రామంలోని భక్తులతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర నుండి బంధుమిత్రులు ఇక్కడికి వచ్చి వీరభద్ర స్వామి ఆలయంలో దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు ఆలయ పూజారులు సంఘయప్ప శివప్ప ఆధ్వర్యంలో జరిగాయి.