– జాతర, అన్నదాన కార్యక్రమాలు
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలోని వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి నాగ్ నాదప్ప పేర్కొన్నారు. బండరాయి మధ్యలో వెలసిన వీరభద్రుడికి భద్రకాళికి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు. మహాశివరాత్రి మూడవ రోజున ఇక్కడ అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తామని, ఒకరోజు ముందు రాత్రిలతో వీరభద్రుడి ని తీసుకువచ్చి గుండంలో భక్తులు నడుస్తారని ఆయన తెలియజేశారు. దాతల సహాయ సహకారాలతో ఆలయం ముస్తబు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం వీరభద్రుడు భద్రకాళి కల్యాణోత్సవం జరిపి అట్టి విగ్రహాలను రథంపై ఊరేగింపు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, భక్తులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ జాతర చుట్టుపక్కల గ్రాముల నుంచి భక్తులు విచ్చేసి మొక్కులు తీర్చుకుంటారని పూజారి పేర్కొన్నారు.
ఎత్తారి సాయిలు (ఆలయ కమిటీ ఛైర్మన్) : వీరభద్ర స్వామి ఆలయం అత్యంత పవిత్రమైందని, వీరభద్రుడి గుడి పైన శిఖరం ఏర్పాటు చేయడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు ఎత్తారి సాయిలు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం మంచినీటిని ఏర్పాటు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలియజేశారు.
రాయనర్స్, (గ్రామ పెద్దలు): వీరభద్రుడి జాతర పురస్కరించుకొని తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు ఈరోజు రాత్రికి ఇక్కడికి విచ్చేసి తమ దుకాణాల స్థలాలను ఏర్పాటు చేసుకుంటున్నారని, రామాలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు ,యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారనీ ఆయన తెలియజేశారు