న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో  వీరసావర్కర్ స్మృతి దివస్

నవతెలంగాణ – కంటేశ్వర్
స్వతంత్ర సమరయోధుడు .వీరసవర్కర్ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ నిజామాబాద్ మరియు న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో స్ముతి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవిదాస్ చందక్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ఒక ఉప్పెనగ వెలిగినటువంటి వ్యక్తి వీరసావర్కర్ అని, న్యాయవాదిగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ స్వతంత్ర పోరాటంలో నిబద్ధతతో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు, అండమాన్ నికోబార్ జైల్లో కఠిన కారాగార శిక్షను అనుభవించడం జరిగింది. స్వతంత్రం కోసం వీరమరణం పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని కొనియాడారు. ఇలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ టిఫిన్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్,న్యాయవాదులు బిట్ల రవి, ఉదయ్ కృష్ణ, వసంతరావు, శరత్ చంద్ర, పిల్లి శ్రీకాంత్ ,కేశవరావు, నారాయణ, గోవర్ధన్,రాజు వెంకటేష్, నారాయణదాసు, తదితరులు పాల్గొన్నారు.