గ్రోమోర్  పై విచారణ  చేపట్టిన వీరాస్వామి

నవతెలంగాణ – కోటగిరి
గ్రోమోర్ రైతులకు కుచ్చుటోపి శీర్షికతో శనివారం ప్రస్తుతం అయిన వార్తకు స్పందనగా బాన్సువాడ ఏ డి ఏ  వీరస్వామి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు కోటగిరి మండల కేంద్రంలోని గ్రోమోర్ దుకాణం పరిశీలించి, ఆర్కే సోనా వరి రకపు విత్తనాలు ఎన్ని బస్తాలు రైతులకు అందించాలని తెలుసుకున్నారు. 58 మంది రైతులకు 150 బస్తాలు ఇచ్చినట్లు గ్రోమోర్ దుకాణపు ఇంచార్జ్ కాశి విశ్వనాధ్ తెలిపారు ఏ డి ఏ వీరస్వామి మీరు ఇచ్చినటువంటి వరి వంగడం స్వల్ప, మధ్య, దీర్ఘకాలమా, ఎన్ని రోజులను పంట చేతికి వస్తుందని అడిగిన ప్రశ్నకు గ్రోమోర్ ప్రతినిధులు నీళ్లు నమిలారు, వెంటనే వరి విత్తనాలపై ఆర్కే సోనా ప్రతినిధులు, అన్ని పత్రాలతో సోమవారం రావాలని లేనియెడల చట్టరీత్యా చలన తీసుకుంటామని చరవాణిలో వరి విత్తనాలు పంపిణీ చేసిన అధికారులకు ఆదేశించారు. కోటగిరీలో మిగిలిన 50 బస్తాలు ఎవరెవరికి ఇచ్చారని, వెంటనే ఆ రైతుల సమాచారం సేకరించమని మండల వ్యవసాయ ప్రతినిధులకు ఏ డి ఏ ఆదేశించారు. సీడ్ కంపెనీ వాళ్లకు పూర్తి సమాచారంతో సోమవారం రావాల్సిందిగా సీడ్ కంపెనీ వాళ్లను  ఆదేశించారు. సీడ్ కంపెనీ వారు వచ్చిన వెంటనే నిజ నిర్ధారణ చేసి , బాధ్యులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని,  రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని,  అనంతరం సంబంధిత రైతుల పంట పొలాలను సందర్శించి, రైతులకు  పంటకు తగు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా తెలియజేసి, భరోసా కల్పించారు. ఏడిఏ వెంట మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గౌస్, సందీప్, ఆస్మా బేగం తదితరులు పాల్గొన్నారు.