జిల్లా స్థాయిలో క్రికెట్ విజేతగా వీర్నపల్లి జట్టు

నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామంలో గత నెల రోజులుగా కొనసాగిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో సోమవారం జరిగిన సెమీ ఫైనల్ లో వీర్నపల్లి జట్టు విజేత గా నిలిచింది. ద్వితీయ స్థానం అడవి పదిర జట్టు నిలిచింది. విజేతగా నిలిచిన జట్టుకు 20 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు 10 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు 5 వేలు , నాలుగు స్థానంలో నిలిచిన జట్టుకు షీల్డ్ ను మాజి సర్పంచ్ ఎడ్ల సాగర్, దినకర్, ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు అరుణ్ కుమార్, మండల నాయకులు జాల పల్లి లచ్చాయ్య, మడుపు తిరుపతి రెడ్డి, నర్సింగం అందజేశారు. క్రీడకారులు ,యువకులూ ఆటల్లో చదువుల్లో ముంది ఉండి మండలానికి పేరు తీసుక రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు, క్రీడకారులు, యువకులు, పాల్గొన్నారు.