
రెంజల్ మండలంలోని పేపర్ మిల్ సమీపంలో నున్న నవదుర్గ ఆలయం ఎదురుగా ఫెరోజుద్దీన్ అనే రైతు కూరగాయల సాగు చేస్తూ తన కుటుంబానికి వెల్లదీస్తున్నారు. సుమారు మూడు ఎకరాల భూ విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తున్న చేస్తున్నారు. ఈ మూడు ఎకరాల భూమిలో కాలీఫ్లవర్, టమాట, ఉల్లి, వివిధ రకాల పూలను నాటి తమ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పంటలు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ముందు జాగ్రత్తగా స్ప్రే మందులు వాడి సమయానుకూలంగా వాటికి రసాయనికి వందనాలు అందజేస్తూ పంటను కాపాడుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. భూతల్లిని నమ్ముకున్న తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన పంటను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.