
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని గ్రామ శివారులో అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్నారని, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని తెలిపారు. అక్రమ మొరం తవ్వకాల నిర్వాహకులు పగటిపూట ఫిర్యాదు చేస్తే రాత్రి సమయంలో తవ్వకాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మొరం దందా అంతా రెవెన్యూ అధికారులకు తెలిసి జరుగుతుందా..?, తెలియకుండా జరుగుతుందా..? తెలియాల్సి ఉంది. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పట్టణ పురవీధుల గుండా యదేచ్చగా మొరం దందా టిప్పర్ల ద్వారా తరలించడంతో గ్రామస్తులు, కాలనీవాసులు ఆగ్రహించి తాసిల్దార్ శివప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలిసిన తాసిల్దార్ రెవెన్యూ సిబ్బందిని తవ్వకాల వద్దకు పంపించారు. అప్పటికే సమాచారం అందుకున్న తవ్వకాల నిర్వాహకులు అక్కడి నుండి పరారయ్యారు. మొరం తవ్వకాల నిర్వాహకులకు స్థానికులు సమాచారం ఇచ్చారా..?, రెవెన్యూ అధికారులే సమాచారం ఇచ్చి తవ్వకాల నుండి వెళ్ళిపోవాలని సూచించారు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటారా లేదా తూతూ మంత్రంగానే చూసి చూడనట్టు వదిలేస్తారా వెచి చూడాల్సి ఉంది.