నవతెలంగాణ – భగత్ నగర్ : కరీంనగర్ పట్టణం పద్మనగర్ డివిజన్ మానేరు డ్యాం కట్ట దగ్గర గల ముత్యాల పోచమ్మ తల్లిని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఈరోజు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాల సమృద్ధిగా కురవాలని పాడి పంటలు బాగా పండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అసెంబ్లీ ఇన్చార్జ్ పురుమళ్ళ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, కరీంనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మడుపు మోహన్ ఆలయ చైర్మన్ గడ్డం శ్రీరాములు, మరియు ఆలయ కమిటీ మెంబర్స్ తదితరులు ఉన్నారు.