కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులను సంగటిత పరిచి రైతాంగ ఉద్యమాలను ఉదృతం చేస్తామని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. మంగళవారం డిచ్ పల్లి మండలం లోని మెంట్రాజ్ పల్లి లో ఎఐకెఎంఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఎంఎస్ పి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకవాస్తామని రైతు ఉద్యమానికి ఇచ్చిన హామీ నేటి వరకు అమలు పరచలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాలలో మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను తమ భూముల నుంచి బేధాకల్ చేయించి అ భూములను కార్పొరేట్ కంపెనీలకు, అధాని, అంబానీలకు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నం రైతు ఉద్యమం తిప్పి కొట్టిందని ఆయన అన్నారు. అప్పటి నుండి వెనక్కి తగ్గిన మోడీ ప్రభుత్వం మల్లి ఆ చట్టాలు తీసుక వచ్చేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్వామినాథన్ సూచనల ప్రకారం పెట్టుబడిలో 50% శాతం కలిపి పంటలకు ధరలు ఇవ్వాలని, మొన్న ప్రకటించిన మద్దతు ధరలు ఏ రైతుకు మద్దతుగా లేవని విమర్శించారు. ఇప్పటికైనాఎంఎస్ పి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాలని డిమాండ్ చేశారు.
గ్రామాలలో పేదవారికి భూమి అత్యంత అవసరమని భూమి ఎ పేదవారికి జీవనందరం అని, అలాంటి భూములు పేదవారికి దక్కాలని నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సయుధ రైతంగా పోరాటం లో దొడ్డి కొమురయ్య అమారుడైనడని అయన అన్నారు. దొడ్డి కొమురయ్య పోరాట స్పూర్తితో రైతాంగ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని భూమయ్య హెచ్చరించారు. ఈనెల 4 న జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి సభలో తగిన కర్తవ్యలు తీసుకుంటామని భూమయ్య అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు బి దేవస్వామి, న్యూడేమోక్రసి డిచ్పల్లి కార్యదర్శి జేపీ గంగాధర్,పివోడ్లు నాయకులు ఎం సుప్రియ, నాయకులు మినాయ్య, ఎడ్ల రాణి,గోదావరి, పెద్దక్క, శాంత,కంజర లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.