రాష్ట్ర స్థాయి 10 కిలోమీటర్ రన్నింగ్ లో వేల్పూర్ వాసికి ద్వితీయ స్థానం

నవతెలంగాణ కమ్మర్ పల్లి 
వరంగల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి10 కిలోమీటర్ల పరుగు పందెంలో వేల్పూర్ మండల కేంద్రంలోనికి చెందిన అశోక్ ద్వితీయ స్థానం సాధించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన గుగ్గలం అశోక్ కు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ మాట్లాడుతూ యువకులు అశోక్ ను  ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
అశోక్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఆర్టీవో కార్యాలయంలో నిధులు నిర్వహిస్తూ జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొని అథ్లెట్ గా రాణిస్తూ ఎన్నో విజయాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.