ప్రేక్షకాదరణ పొందిన “వెలుగై కదిలావే” పాట

నవతెలంగాణ- హైదరాబాద్: ‘వెలుగై కదిలావే’ పాటతో శ్రోతల మన్ననలను పొందుతున్న సుమంత్ బొర్రా, వెంకటేష్ వుప్పల, తిరునగరి శరత్ చంద్ర..
‘పడిపోయా’, ‘ఎలా మరి ఇకరావా?’, ‘మాయ చేశావే’, ‘ఈ నైటే’, ‘లైఫంత హోలీ’ వంటి పాటలతో ఒక ఊపు ఊపేసిన ప్లానెట్ రెడ్ మ్యూజిక్ టీమ్ ఈ సారి ‘వెలుగై కదిలావే’ అనే మెలోడీ సాంగ్ తో మన ముందుకు వచ్చింది. ఈ బ్యూటీఫుల్ అందరిని ఇట్టే ఆకర్షించేస్తోంది. ఎంతో ప్రణాళిక బద్ధంగా ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు వెంకటేష్ వుప్పల. సుమంత్ బొర్రా నిర్మాణ సారధ్యంలో ఈ పాట రిలీజ్ కావడం మరో విశేషం. వినగానే శ్రోతల హృదయాలను కొల్లగొట్టేలా ఈ పాట ఉంది. ఈ పాటను గళంతో కాకుండా హృదయంతో పాడారా అన్నంత అద్భుతంగా పాడారు సుమంత్ బొర్రా, వెంకటేష్ వుప్పల. ప్రతి ప్రేమికుడు ఈ పాటను తన కోసమే రాశారా అన్నంత మధురంగా ఈ పాటను రాశారు తిరునగరి శరత్ చంద్ర. ఈ పాట ఏప్రిల్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా Amazon, Wynk Music,Jio Saavan,Apple,Anghami,Sportify,Gaana వంటి అన్ని ఆడియో పోర్టల్స్ లో రిలీజ్ అయ్యి అందరి గుండెల్ని తడిమేసింది. సుమంత్ బొర్రా ప్రొడ్యూసింగ్ లో అతి త్వరలో లిరికల్ వీడియో కూడా రిలీజ్ కానుంది.. ఈ పాటకు మ్యూజిక్, మిక్స్, మాస్టరింగ్ వెంకటేష్ పుప్పల అందించారు. సుమంత్ బొర్రా నిర్మాణ సారధ్యంలో ఈ పాట విడుదల అయింది. సుమంత్ బొర్రా, వెంకటేష్ పుప్పల పాడారు. తిరునగరి శరత్ చంద్ర సాహిత్యాన్ని అందించారు. ఎన్నిసార్లు విన్నా తనివితీరని వండర్ ఫుల్ మెలోడీసాంగ్ ఈ “వెలుగై కదిలావే”. త్వరలో వీడియో సాంగ్ విడుదల చేయనున్నారు.