ప్రభుత్వ సలహాదారుడిగా నియమకంపై వేం నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం

– నవతెలంగాణ – నెల్లికుదురు
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని నియమించడం పట్ల నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు హర్ష వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాదులోని  నరేందర్ రెడ్డి స్వగృహంలో ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాలు నిర్వహించారు. శుభాకాంక్షలు తెలిపిన వారు నెల్లికుదురు మండలం వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్ పీఏసీఎస్ డైరెక్టర్లు. రావుల సతీష్ సారంపల్లి వెంకటరెడ్డి  డీసీసీ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్ జిల్లా నాయకుడు కాసం రంజిత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇట్టే దేవేందర్ రెడ్డి పెరుమాండ్ల మల్లేశం ఆకుతోట సతీష్ సాయి లు మాట్లాడుతూ.. మా ప్రాంతం నుండి రాష్ట్ర సీఎం ప్రభుత్వ సలహాదారుడిగా మాజీ ఎమ్మెల్యే మేం నరేందర్ రెడ్డికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉందని అన్నారు. కష్టాకాలంలో ఉండి పార్టీని పట్టుకొని కార్యకర్తల సమస్యలను పరిష్కరించుకుంటూ ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని అన్నారు. నేడు మా ప్రాంత ముద్దుబిడ్డ ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం జరిగినందున మా ప్రాంత ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.