
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మస్కట్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఆదివారం పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మహోత్సవంలో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఎన్నారైలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.