రాజన్నను దర్శించుకున్న వేములవాడ అడిషనల్ ఎస్పీ..

నవతెలంగాణ-వేములవాడ : దక్షిణ కాశీ ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని వేములవాడ డివిజన్ అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి  శుక్రవారం రాజన్న ను కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు.స్వామివారి వేద పారాయణ  మండపం లో అర్చకులు ఆశీర్వచనం చేసి న అనంతరం ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతిరావు లడ్డు ప్రసాదము అందజేశారు.రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు సీరిగిరి శ్రీరాములు,  అడిషనల్ ఎస్పి శేషాద్రి రెడ్డికి పూల మొక్క అందజేశారు. ఆమె వెంట పట్టణ, రూరల్ సిఐలు, దేవాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.