వేములవాడ  కమలం టికెట్ ఖరార్..!


– పోరాడి ఓడిన వికాస్

– వికాస్ సేవలు బూడిదలో పన్నీరు?
– ఉత్కంఠం నుండి బయట పడ్డ కార్యకర్తలు
నవతెలంగాణ- చందుర్తి
అన్ని పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీలు ముందుగానే ప్రకటించినప్పటికీ బీజేపీ మాత్రం అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో జాప్యం చేసింది. దీంతో వేములవాడ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గత రెండు సంవత్సరాలు గా వికాసరావు సేవ కార్య క్రమాలు చేపట్టాడు. అదేవిదంగా మాజీ జెడ్పి ఛైర్ పర్సన్  తుల ఉమ కూడా బీజేపీ టికెట్ ఆశించి ప్రజల్లో ముందుగానే తనకే టికెట్ అని ప్రచారం చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య పోటీ తీవ్రం కావడంతో టికెట్ నాన్చుడు జరిగిందని తెలుస్తుంది. సిరిసిల్ల టికెట్ రాణి రుద్రమకు ఇవ్వడంతో వేములవాడ కూడా తుల ఉమకు ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో తుల ఉమ ముందుగానే ప్రచార రథాలు సిద్ధం చేసుకుంది.  జిల్లాలో రెండు మహిళ కు భాజపా టికెట్ కెటాయించింది.
ముగ్గురు బిసి సామాజిక వర్గం, ఒకరు వెలమ సామాజిక వర్గం
వేములవాడ లో ముగ్గురు బిసి సామాజిక వర్గం ఒకరు వెలమ సామాజిక వర్గం నుండి పోటీ సిద్ధ మైనారు. బిసి వర్గం నుండి అది శ్రీనివాస్, తుల ఉమ, గోలి మోహన్, వెలమ సామాజిక వర్గం నుండి లక్ష్మి నర్సింహా రావు పోటీలో ఉన్నారు.
అది శ్రీనివాస్, లక్ష్మి నర్సింహా రావు మద్యే పోటీ
బీఆర్ఎస్ పార్టీ తరుపున లక్ష్మి నర్సింహా రావు, ప్రభుత్వ పథకాల పేరు తో ముందుకు వెళ్తున్నాడు. ఓడిన ప్రజల మధ్య నే ఉంటూ అందుబాటులో ఉంటున్నాను అని ప్రజల్లో మమేకం ఐతున్నారు. బీజేపీ టికెట్ ఆలస్యం కావడంతో తో బీజేపీ యువకులు అసహనంతో ఉన్నారు. యువకుల పాలోయింగ్ వికాసరావు కు ఉంది.  దింతో తుల ఉమకు యువకులు మొగ్గు చూపరనే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కాంగ్రేస్, బీజేపీ అభ్యర్థుల మద్యే పోటీ అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
వికాస్ రావు సేవలు బూడిదలో పన్నీర్!
పోరాడి ఓడిన వికాస రావు
వేములవాడ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వికాస రావు గత రెండేళ్లుగా సామాజిక సేవ కార్య క్రమాలు,వైద్య శిబిరాలు నిర్వహించారు.కానీ టికెట్ కోసం.వికాస రావు పోరాడి ఓడి నాడు.