
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి వేములవాడలోని నూతన లైబ్రరీ భవనం, లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రమును కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల, వేములవాడ లలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 744 మంది ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, వీరికి తేదీ మే 3 నుండి మే 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారు 12 రకాల ఫోటో గుర్తింపు కార్డు లలో ఏదైనా ఒకటి తమ వెంట తీసుకుని వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని, హోమ్ ఓటింగ్ లో గోప్యత ను పాటించాలని నిర్ణీత నమూనా ఫారాల లో సమాచారాన్ని పూర్తి చేయాలని సూచించారు.ఆయన వెంట వేములవాడ ఆర్డీవో, ఏ.ఆర్.ఓ రాజేశ్వర్, సిరిసిల్ల ఆర్డీవో రమేష్, డీ.డబ్ల్యూ.ఓ లక్ష్మీరాజం, వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.