రమావత్ కళ్యాణి ని సన్మానిస్తున్న: వెన్ రెడ్డి రాజు

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: తెలంగాణ రాష్ట్ర  గురుకుల పాఠశాల/కళాశాల చౌటుప్పల్ (బాలికల)లో సమగ్ర శిక్ష తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ఉత్సవ కార్యక్రమంలో జాతీయస్థాయిలో జానపద గీతాలాపన విభాగంలో ఎంపిక కాబడిన 9వ తరగతి విద్యార్థి కుమారి రామావత్ కళ్యాణి జాతీయస్థాయిలో ఢిల్లీ నెహ్రూ బాల భవన్ వెళుతున్నందుకు అభినందిస్తూ విజయాన్ని ఆకాంక్షిస్తూ పాఠశాల ఆవరణలో శనివారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు రమావత్ కళ్యాణిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో SMC చైర్మన్ చింతల సాయిలు, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని రామావత్ కళ్యాణికి అభినం దనలు తెలియజేశారు.