నవతెలంగాణ – చండూరు చండూరు ఎస్సైగా వెంకన్న మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈయన సూర్యపేట సి సి యస్ నుండి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన సురేష్ నల్గొండ 1 టౌన్ కు బదిలీ పై వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైరవీలకు తావివ్వకుండా నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు. మండల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు.