కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా వెంకటకృష్ణ

నవతెలంగాణ – గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీ మండల నూతన అధ్యక్షునిగా పాలడుగు వెంకటకృష్ణ శుక్రవారం నియమితులయ్యారు. గత రాత్రి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ మరియు ఎమ్మెల్యే సీతక్క లు నియామక పత్రాన్ని వెంకటకృష్ణకు అందించారు. నూతన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా పాలడుగు వెంకటకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మండలం లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారని అన్నారు.జిల్లా అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండల కేడర్ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ముందుకు సాగిపోతామని అన్నారు. అధ్యక్షుని నియామకంలో పాల్గొన్న అధినాయకత్వానికి మండల నాయకత్వానికి అందరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
వెంకట కృష్ణ నియామకం పట్ల సర్వత్ర హర్షం
కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షునిగా పాలడుగు వెంకటకృష్ణ నియామకం పట్ల ఆ పార్టీ మండల నాయకత్వం ప్రజా ప్రతినిధులు ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకటకృష్ణ చిన్ననాటి స్నేహితులు మరియు పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున వెంకటకృష్ణ కు శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీలో మొదలైన రాజకీయ జీవితం అంజనంచెలుగా రాష్ట్ర క్యాడర్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం వెంకటకృష్ణకు ఉందని పార్టీ అభివృద్ధికి గెలుపుకు దోహదం చేయగల సత్తా ఉందని అన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న కొన్ని ప్రాంతాలలో వెంకటకృష్ణ రాకతో పార్టీ బలోపేతంగా తయారవుతుందన్న ఆశాభావాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు సరైన వ్యక్తిని ఎంపిక చేశారని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.