నవీపేట్ తహసిల్దార్ గా వెంకటరమణ 

Venkataramana as Navipet Tehsildarనవతెలంగాణ – నవీపేట్
నవీపేట్ మండల తహసీల్దారుగా వెంకట రమణ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. డొంకేశ్వర్ మండలంలో తహసిల్దారుగా పనిచేసిన వెంకటరమణ బదిలీపై నవీపేట్ ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టగా రెవెన్యూ సిబ్బంది ఆయనకు శాలువతో సన్మానించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి ఆటంకం లేకుండా వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు.