వెంకటరమణ జోడు పదవులు అవుట్ . ఇప్పుడు పాఠాలు చెప్పుతారా…?

నవతెలంగాణ -ముధోల్: ట్రిపుల్ ఐటీ వీసీ గా పనిచేసిన వెంకటరమణ ను ప్రభుత్వం తొలగించటంతో మళ్లీ తన మాతృ సంస్థకు వెళ్లి వెంకటరమణ పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ గా ,ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ గా వెంకటరమణ గత కొన్ని సంవత్సరాలుగా పనిచేశారు.అయితే బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీగా పనిచేస్తు, అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు ఇటివలే ఆరోపించారు. వెంటనే వీసీ నుంచి జోడు పదవుల్లో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

మహిళా ఉద్యోగులపై వీసీ లేంగిక వేదింపులకు పాల్పడ్డారని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు.డిప్యుటీ సిఎం బట్టి విక్రమార్క కు ఎమ్మెల్సీ కోదండరాంకు , విధ్యార్థి సంఘ నాయకులు పిర్యాదు చేశారు.ప్రభుత్వంపై ఒత్తిడి పెరగటం తో పాటు,వీసీ వ్వవహారం తో ప్రభుత్వం కు చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం మంగళవారం రాత్రి వీసీ ని తొలగింస్తు, కొత్త వీసీ నీ నియమించారు.అంతేగాకుండా ఆయనే ఉన్నతవిద్య మండలి వైస్ చైర్మన్ గా ఉన్న వెంకట రమణ ను తొలగింస్తు, వైస్ చైర్మన్ గా ఇటిక్యాల పురుషోత్తం ను నియమించారు. దీంతో వెంకటరమణ తన మాతృ సంస్థ అయిన హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ విధ్యార్థులకు పాఠాలు బోధించటానికి యునివర్సిటీ కీ వెళ్లాల్సి ఉంటుంది. సంవత్సరాలుగా వీసీ బోధన పక్కన పెట్టి, పాలనాపరమైన పోస్టులో పనిచేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో వీసీ వెంకటరమణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎన్ని ఆరోపణలు వచ్చిన తను మాత్రం యధావిధిగా వీసీ గా కొనసాగారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంకటరమణ పై విద్యార్థి సంఘాలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో వీసీ తనకున్న పలుకుబడితో సుమారు పది నేలలవరకు పనిచేశారు. ఎట్టకేలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంఘం, ఉస్మానియా విద్యార్థి జేఏసీ పోరాటం ఫలితంగా ట్రిపుల్ ఐటీ వీసి, ఉన్నతవిద్య మండలి వైస్ చైర్మన్ జోడు పదవుల నుండి ప్రభుత్వం తొలగించక తప్పలేదు. వెంకటరమణ మళ్లీ సెంట్రల్ యూనివర్సిటీలోకి వేళ్ళి పాఠాలు చెప్తారు లేదో వేచి చూడాలి మరి..!