
మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడికే,భారీ మెజార్టీతో గెలిపిస్తామని రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ అన్నారు. ఆదివారం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపొందడం ఖాయమని, ఆయనకు ఉమ్మడి మెదక్ జిల్లాతో 20 సంవత్సరాల అనుబంధం ఉందని ఉమ్మడి మెదక్ జిల్లా పిడి, జాయింట్ కలెక్టర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేయడం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలతో సత్సంబంధాలు పరిచయాలు ఉన్నాయన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వెంకటరామిరెడ్డి వివిధ హోదాలో పనిచేసి ప్రజలకు సేవ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తుందన్నారు. వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. డిసెంబర్ 9 న అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు ఊసే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రక్షకుడని ప్రజలు నమ్ముతున్నరని, బస్ యాత్ర చేపట్టిన కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారని వారి సమస్యలను మొరపెట్టుకుంటున్నారన్నారు. అలాగే గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదన్నారు. అంగు ఆర్పాటాలు ప్రచారాలు తప్ప అభివృద్ధి శూన్యం అన్నారు. విదేశీ బ్యాంకులలో ఉన్న నల్లధనం వెనక్కి తీసుకువచ్చి ప్రజలకు ఒక్కొక్కరికి 15 వేలు జమ చేస్తామన్నారు. దళితులు, ముస్లింల మీద దాడులు చేస్తూ మత రాజకీయం చేస్తున్న బిజెపికి చరమగీతం పాడాలన్నారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నారని అలాంటి బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలను పాతరేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు అయ్యగల రవి, మాజీ సర్పంచ్ చిరంజీవి, నాయకులు శ్రీనివాస్, రవీందర్, వెంకటేష్, స్వామి, నర్సింలు, లింగం తదితరులు పాల్గొన్నారు.